హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగిసిన ZP పాలకవర్గ పదవీ కాలం

ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజాపరిషత్‌ పాలకవర్గ పదవీ కాలం గురువారంతో ముగియనుంది. నూతన జిల్లాల విభజన నేపథ్యంలో గుంటూరుతో పాటు పల్నాడు, బాపట్ల జిల్లాలకు ప్రత్యేక జడ్పీ కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐదేళ్ల పదవీ కాలం పూర్తి కావడంతో ఈ కొత్త జిల్లాల్లో శుక్రవారం నుంచి పాలనా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.