హైదరాబాద్: 28°C
తెలంగాణ

సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించిన MLA

JN: స్టేషన్ ఘనపూర్ మండలం రంగరాయగూడెంలో పీఎం కుసుమ్ పథకం కింద రైతు నెలమంచ అజయ్‌రెడ్డి ఏర్పాటు చేసిన 2 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు సంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. తక్కువ సాగు ఉన్న భూముల్లో సోలార్ ప్లాంట్లతో స్థిరమైన ఆదాయం పొందొచ్చన్నారు.