హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట ఆడుతూ దొరికిన మాజీ ఎమ్మెల్సీ

SDPT: పట్టణ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాజీ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి ఇంట్లో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్సీతో పాటు మరో 4 వ్యక్తులు పట్టుబడగా, ముగ్గురు పరారీలో ఉన్నారు. ఈ దాడిలో రూ.11,600 నగదు, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మురళి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.