హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుత్తూరులో రేపు ఎమ్మెల్యే పర్యటన

CTR: పుత్తూరులో గురువారం ఎమ్మెల్యే భాను ప్రకాష్‌ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు పుత్తూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో రూ.23 లక్షలతో నిర్మించనున్న రైతు బజార్‌కు భూమిపూజ చేయనున్నారు. అనంతరం 9.30 గంటలకు వడమాలపేట మండలం వేమపురం గ్రామంలో రూ.7 లక్షలతో నిర్మించిన ఆర్‌వో ప్లాంట్‌, స్మశాన బోరు, చేతిపంపును ప్రారంభించనున్నారు.