హైదరాబాద్: 28°C
తెలంగాణ

మరిపెడలో మత సామరస్యానికి నిదర్శనం

MHBD: మరిపెడ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో హుండీ వేలం నిర్వహించారు. ఈ వేలంలో బుధవారం పట్టణానికి చెందిన షేక్ రహీముద్దీన్, రషీదా బేగం దంపతులు రూ.6,515లకు హుండీ పాట పాడారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ కార్యక్రమాన్ని పలువురు అభినందించారు. ప్రతి ఏడాది లడ్డూ, హుండీ వేలాల్లో పాల్గొంటామని వారు తెలిపారు.