హైదరాబాద్: 28°C
క్రీడలు

VIDEO: క్రికెట్ ఆడుతూ మైదానంలోనే..!

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్న 25 ఏళ్ల రాంరాజ్ మీనా అకస్మాత్తుగా ఛాతీ నొప్పితో మైదానంలోనే కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించే లోపే అతడు మృతి చెందాడు. గుండెపోటు కారణంగానే ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు. కాగా, ఐదు నెలల క్రితమే అతడికి వివాహం జరగడం స్థానికంగా అందరినీ కలిచివేసింది.