హైదరాబాద్: 28°C
క్రీడలు

జపాన్ వినూత్న ప్రయత్నం.. సచిన్ ఫిదా

జపాన్ క్రికెట్ అసోసియేషన్ వినూత్న ప్రయత్నంపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు. భారత్‌తో మ్యాచ్‌కు వచ్చిన అభిమానులకు క్రికెట్ నిబంధనల బుక్‌లెట్ అందజేయడం తనను ఆకట్టుకుందని తెలిపాడు. కొత్త ప్రాంతాలకు క్రికెట్ విస్తరించడం సంతోషకరమన్నాడు. భారత్‌కు గట్టి పోటీనిచ్చిన జపాన్ జట్టు పోరాటపటిమను అభినందిస్తూ 'హ్యాట్సాఫ్' చెప్పాడు.