హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎద్దును తప్పించబోయి ఆటో బోల్తా

KMR: సింగీతం నుంచి బాన్సువాడ వైపు వెళ్తున్న ప్యాసింజర్ ఆటో కొయ్యగుట్ట చౌరస్తా వద్ద రోడ్డుపైకి వచ్చిన ఎద్దును తప్పించబోయి ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సింగీతం గ్రామానికి చెందిన కంచం ఇందు(21) అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.