JN: సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. దేవరుప్పుల మండలం బంజరలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలను బుధవారం కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఎర్రబెల్లి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలన్నారు.
తెలంగాణ
'సాగునీరు అందక రైతుల ఇబ్బందులు'


