హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం పర్యటన భద్రతా ఏర్పాట్ల పరిశీలన

SRCL: ఈనెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే బుధవారం పోలీసు అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి వీఐపీ, వీవీఐపీ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, ప్రజల రాకపోకలు, అత్యవసర సేవలపై అధికారులకు సూచనలు చేశారు.