హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలకుర్తిలో అస్మిత రగ్బీ పోటీలు

JN: పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామ ZPHS పాఠశాలలో బుధవారం జిల్లా స్థాయి అస్మిత రగ్బీ పోటీలను నిర్వహించారు. 15, 18 ఏళ్ల బాలికల విభాగాల్లో జరిగిన పోటీలకు జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు దొంతమల్ల గణేష్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా సీఐ భరత్ సుమన్, తెలంగాణ రగ్బీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శేషు పాల్గొన్నారు. క్రీడా ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం అన్నారు.