KMM: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ ఆదేశించారు. రెడ్ అలర్ట్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.
తెలంగాణ
'రెడ్ అలర్ట్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలి'


