జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాగారం గ్రామంలో ఇటీవల మృతి చెందిన మడే సమ్మక్క కుటుంబాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పరామర్శించారు. దశదిన కర్మలకు హాజరై కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి, పార్టీ తరఫున రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రవి పటేల్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
'సమ్మక్క కుటుంబానికి రవి పటేల్ పరామర్శ'


