హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాస్థాయి పోటీల్లో శ్రీహరి సత్తా

VKB: జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో బంట్వారం తెలంగాణ మోడల్‌ స్కూల్‌ విద్యార్థి ఎం. శ్రీహరి ప్రతిభ చాటాడు. షాట్‌పుట్‌, 200 మీటర్ల పరుగు విభాగాల్లో ద్వితీయ స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు శ్రీహరిని అభినందించారు.