హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిగ్వా ప్రాజెక్టు బాధితులకు త్వరలోనే సహాయం

NRML: కుభీర్ మండలం నిగ్వాలో గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ వల్ల ఇళ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు త్వరలోనే పూర్తి సహాయం అందిస్తామని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా హామీ ఇచ్చారు. ఆయన బాధితులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ తగిన పరిహారం అందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.