హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా నవరాత్రుల ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ

GDWL: అలంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల గోడ పత్రికలు, ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే విజయుడు ఆవిష్కరించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా వేడుకలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో దీప్తి, మున్సిపల్ చైర్మన్ పి. జయరాముడు తదితరులు పాల్గొన్నారు.