హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి: జేసీ

ATP: ప్రభుత్వం 80 శాతం సబ్సిడీతో అందిస్తున్న ప్రత్యామ్నాయ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకొని పంటలు సాగు చేయాలని జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ కోరారు. అనంతపురం కలెక్టరేట్‌లో ప్రాథమిక రంగాల ప్రగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మిగిలిన విస్తీర్ణంలోనూ ప్రత్యామ్నాయ పంటలు సాగులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.