NGKL: నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం ఉడిమిళ్ల వద్ద బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకులు కిందపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పరమేశ్ (30) చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో యువకుడు దేవరాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న పరమేశ్ మృతితో భార్య, ముగ్గురు పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు.
తెలంగాణ
బైక్ అదుపుతప్పి యువకుడి మృతి


