హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిల్లర్‌లో చెయ్యి ఇరుక్కొని వ్యక్తికి తీవ్ర గాయాలు

WNP: మిల్లర్‌ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు యంత్రంలో చెయ్యి ఇరుక్కొని కుమ్మరి గోపి తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం మిల్లర్‌కు గ్రీస్ పెడుతూ యంత్రం ఆన్‌లో ఉండగానే ఫోన్ మాట్లాడుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. అక్కడివారు వెంటనే అతడిని బయటకు తీసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.