హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కనువిందు చేస్తున్న మాల్వాడి గుండం

TPT: వర్షాలతో తిరుపతిలోని మాల్వాడి గుండం జలపాతం కనువిందు చేస్తోంది. దీంతో జలపాతాన్ని వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పలువురు జలపాతం వద్ద సందడి చేస్తూ జలకాలాడుతున్నారు. అయితే ప్రాంతం జారుడుగా ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు భద్రతా చర్యలు చేపట్టి సందర్శకులను అప్రమత్తం చేయాలని కోరుతున్నారు.