హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూములు ఆక్రమించి ఫామ్‌హౌస్‌లు కట్టారు: ఎమ్మెల్యే

RR: షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేశారు. గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ నాయకులు భూములు ఆక్రమించి ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తెలంగాణను అప్పులపాలు చేశారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటుతో కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు మాత్రమే లబ్ధి పొందారని, ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని ఆయన విమర్శించారు.