NTR: పెనుగంచిప్రోలులోని శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో తొమ్మిది రోజుల గణేష్ నవరాత్రి ఉత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. ప్రత్యేక పూజల అనంతరం, ఎద్దుల బండిపై గణనాథుడి శోభాయాత్ర మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ వైభవంగా సాగింది. ధర్మకర్తల ఛైర్మన్ చుంచు రమేష్ దంపతులు, ఆలయ ఈవో జంగం శ్రీనివాసరావు, పాలకమండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పెనుగంచిప్రోలులో వైభవంగా వినాయక నిమజ్జనం


