TPT: తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలోని పుష్కరిణికి ఎంతో పవిత్రత ఉంది. ముక్కోటి తీర్థాలు ఇక్కడ కలుస్తాయని భక్తుల విశ్వాసం. బ్రహ్మోత్సవాల ముగింపులో చక్రస్నానం కూడా పుష్కరిణిలోనే నిర్వహిస్తారు. భక్తులు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పుష్కరిణిని వినియోగించాలి. సబ్బులు, షాంపూలు వాడటం, ఈత కొట్టడం, దుస్తులు ఉతకడం, ఫొటోలు, వీడియోలు తీయడం నిషేధం.
ఆంధ్రప్రదేశ్
పుష్కరిణిలో ఇవి నిషేధం


