KRNL: పెద్దకడబూరు మండలంలో రేషన్ డీలర్ల వెయిట్ మిషన్లను తూనికలు, కొలతల శాఖ ఆదోని ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు ఇవాళ తనిఖీ చేశారు. ప్రతి డీలర్ ఏడాదికి ఒకసారి చలానా చెల్లించి వెయిట్ మిషన్లకు ట్యాగులు వేయించుకోవాలని సూచించారు. కొలతల్లో అవకతవకలకు తావులేకుండా బియ్యం పంపిణీ చేయాలని, వ్యాపారులు సైతం తూనికలు, కొలతల నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
రేషన్ డీలర్ల వెయిట్ మిషన్ల తనిఖీ


