హైదరాబాద్: 28°C
తెలంగాణ

సచివాలయంలో నిలిచిన ఇంటర్నెట్ సేవలు

HYD: తెలంగాణ సచివాలయంలో బుధవారం ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో పలు ప్రభుత్వ శాఖల్లో పౌర సేవలకు అంతరాయం ఏర్పడింది. మీడియా సెంటర్, పబ్లిసిటీ సెల్, ఎన్ఆర్ఏ అసిస్టెన్స్ సెల్ తదితర విభాగాల్లో నెట్‌వర్క్ సమస్యలతో ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. వివిధ పనుల కోసం సచివాలయానికి వచ్చిన ప్రజలు సేవలు అందక తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.