హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనారిటీ విద్యాసంస్థలను సందర్శించిన మజీద్ అప్సర్

జనగామ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ ఛైర్మన్ మజీద్ అప్సర్ మైనారిటీ పాఠశాల, కళాశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణ ముఖ్యమన్నారు. వీధి దీపాల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యారంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.