హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తిరువూరులో భారీ వర్ష బీభత్సం

NTR: తిరువూరు నియోజకవర్గంలో తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పట్టణంలోని ప్రధాన రహదారులు వరద ప్రవాహంతో పొంగి పొర్లుతున్నాయి. బస్టాండ్‌లోకి చేరుకునేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఈ వర్షంలోనే గణేష్ నిమజ్జనం సందర్భంగా చిన్నారులు, మహిళలు కోలాటం ఆడుతూ సందడి చేశారు.