హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేరుపాలెం బీచ్‌కి సందర్శకులు రావద్దు: ఎస్సై

W.G: మొగల్తూరు పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 23, 24 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తుఫాను హెచ్చరికలు ఉన్నందున పేరుపాలెం బీచ్‌కు సందర్శకులకు అనుమతి లేదని ఎస్సై జి. వాసు తెలిపారు. వాతావరణ మార్పులతో సముద్ర అలలు వేగంగా వస్తున్నందున ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. సందర్శకులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలని కోరారు.