హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిశువుల మృతిపై సుమోటో కేసు

HYD: ఆదిలాబాద్‌ రిమ్స్‌లోని ఎస్‌ఎన్‌సీయూలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు నవజాత శిశువులు మృతి చెందిన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) సుమోటోగా కేసు స్వీకరించింది. ప్రమాదానికి కారణాలు, శిశువుల మృతికి దారితీసిన పరిస్థితులు, అగ్ని భద్రతా చర్యలు, రక్షణ, వైద్య సేవలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది.