హైదరాబాద్: 28°C
తెలంగాణ

సద్దల చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

SRPT: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దల చెరువు వద్ద గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఇవాళ పట్టణ పోలీసులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జనానికి వినియోగించే క్రేన్ పనితీరును, భద్రతా చర్యలను తనిఖీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.