హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జన ఏర్పాట్లపై సూచనలు చేసిన కలెక్టర్

NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి చెరువు వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను బుధవారం కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు. జాతీయ రహదారి వెంట ఉన్న ఈ ప్రాంతంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చేపట్టిన ఏర్పాట్లపై అధికారులకు తగు సూచనలు చేశారు. కలెక్టర్ తో ఎంపీడీవో పాండు, ఎంపీవో కోటేష్, డీటీ విజయ, ఆర్ఐ అమర్నాథ్, డీఈ రామకృష్ణ, సర్పంచ్ కాటం వెంకటేశం ఉన్నారు.