హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పీహెచ్‌సీలో స్వీపర్‌తో డ్రెస్సింగ్.. విచారణ

JGL: మల్యాల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు స్వీపర్ డ్రెస్సింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో స్టాఫ్ నర్సుల విధుల నిర్వహణపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాస్ పీహెచ్‌సీని సందర్శించి ఘటనపై విచారణ చేపట్టారు. సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.