ASR: అనంతగిరి మండలం ఒనుకొండ గ్రామానికి వెళ్లాలంటే శారదా నదిని దాటాల్సిందే. వర్షాలకు నదిలో నీటిమట్టం పెరగడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, మహిళలను భుజాలపై ఎక్కించుకుని పీకల్లోతు నీటిలో బిక్కుబిక్కుమంటూ నదిని దాటిస్తున్నారు. ఏ మాత్రం అదుపుతప్పినా ప్రాణాలకు ముప్పు పొంచి ఉండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రాణాలకు తెగించి నది దాటాల్సిందే..!


