హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నదానంలో పాల్గొన్న ఎమ్మెల్యే

MBNR: జడ్చర్ల మున్సిపాలిటీలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు నిర్వాహకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు.