హైదరాబాద్: 28°C
తెలంగాణ

చౌటుప్పల్‌లో బార్‌లో చోరీ

BHNG: చౌటుప్పల్‌లోని దర్బార్ బార్‌లో అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు బార్‌లోకి చొరబడి రూ.4 లక్షల నగదును అపహరించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న బార్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. చోరీకి పాల్పడిన వారిని గుర్తించేందుకు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.