హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గణపతి శోభాయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాలి'

NZB: ఇందూరులో నిర్వహించే వినాయకుడి శోభాయాత్రకు అధికారులు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ సూచించారు. బుధవారం నగరంలో శోభాయాత్ర రూట్​మ్యాప్​ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఇందూరులో నిర్వహించే గణపతి శోభాయాత్ర ఎంతో ప్రత్యేకమైనది అన్నారు. భక్తులు అధికారుల సూచనలు పాటించాలన్నారు.