హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నిమజ్జనానికి భద్రతా చర్యలు తీసుకోవాలి'

BHPL: గోరి కొత్తపల్లి మండలంలో వినాయక నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, భద్రతగా నిర్వహించేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సర్పంచ్ శంకర్ సూచించారు. గోదావరి, వాగులు, చెరువుల వద్ద నిమజ్జనం చేసే సమయంలో చెరువు నీటిలోకి దిగకుండా జాగ్రత్తగా ఉండాలని, పిల్లలు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ముఖ్యంగా పోలీసులు సూచించే నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు.