హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో చోరీ

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. బుధవారం సిబ్బంది తలుపులు తెరిచే సమయంలో విషయం వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని దుండగులు తాళాలు పగలగొట్టి నాలుగు సెల్‌ఫోన్లు అపహరించినట్లు సీడీపీవో సరోజిని తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసి, నిందితులను వెంటనే గుర్తించి పట్టుకోవాలని కోరారు.