హైదరాబాద్: 28°C
తెలంగాణ

'26న చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు'

KMM: వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఈనెల 26న నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారిణి జి.జ్యోతి తెలిపారు. వైరా రోడ్డులోని ప్రభుత్వ వైద్య కళాశాల ఎదుట ఉన్న ఐలమ్మ విగ్రహం వద్ద ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఐలమ్మ జయంతిని విజయవంతం చేయాలని ఆమె కోరారు.