హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోక్ష గణపతి సన్నిధిలో ఎమ్మెల్యే పటేల్

NRML: లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్‌లో మోక్ష గణపతిని ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌ దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పుష్కలంగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. వచ్చే ఏడాది పుష్కరాల్లో 12 రోజుల పాటు అన్నదానం చేస్తానని తెలిపారు.