హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫిరంగి నాలా కబ్జాపై చర్యలేవి?

RR: శంషాబాద్ మండలం సాతంరాయి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 4, 5, 6లో ఉన్న ఫిరంగి నాలా ఆక్రమణకు గురైందని ఫిర్యాదులు అందుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలాను కాంక్రీట్ కాలువగా మార్చడంతో పాటు రహదారిగా వినియోగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. జలవనరుల పరిరక్షణకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.