NZB: నవీపేట్ మండలం యంచ, అల్జాపూర్ గ్రామాల్లో అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులకు భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఒక్కో అంగన్వాడీ భవనం నిర్మాణానికి రూ.12 లక్షల విలువ ఉన్నట్లు తెలిపారు. యంచలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ బి. సాయిలు, ఉప సర్పంచ్ ప్రవీణ్ యాదవ్, వార్డు సభ్యులు గంగాధర్, మారుతి, రేఖ, కాంగ్రెస్ కార్యకర్తలు ధర్మాజీ, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
అంగన్వాడీ భవనాలకు భూమిపూజ


