మెదక్ జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. పేద ప్రజలందరికీ సొంత నివాసం కల్పించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి మోదీ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు.
తెలంగాణ
'పీఎంఏవై కింద 2 లక్షల ఇళ్ల మంజూరు'


