ADB: నార్నూర్ మండల కేంద్రంలో బుధవారం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌తో పాటు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లైసెన్సు లేకుండా వాహనాలు నడపవద్దని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ప్రశాంత్, గోకుల్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: నార్నూరులో డ్రంక్ అండ్ డ్రైవ్


