హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

YCP క్యాడర్ జోలికి వస్తే వదలం: ఎంపీ

CTR: పార్టీ క్యాడర్ జోలికి వస్తే మాత్రం వదిలే ప్రసక్తే లేదని వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అన్నారు. బుధవారం పుంగనూరులో పర్యటించిన ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తమపై దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు బనాయించినా సహనంగా ఉన్నామని తెలిపారు. అయితే తమ పార్టీ క్యాడర్ జోలికి వస్తే వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.