హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుష్కరిణి గోడ పునర్నిర్మాణానికి హామీ

CTR: పుంగనూరు కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న పుష్కరిణి గోడను నాలుగు రోజుల క్రితం గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ధ్వంసమైన గోడను ఎంపీ మిథున్ రెడ్డి బుధవారం పరిశీలించారు. పుష్కరిణి గోడ పునర్నిర్మాణ పనులను వెంటనే చేపడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హిందూ జాగరణ సమితి సభ్యులు కొండవీటి నాగభూషణం, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.