కోనసీమ: అమలాపురం పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా ఉన్న చల్లపల్లి కాలువలో గుర్తు తెలియని పురుషుడి మృతదేహం లభ్యమైంది. స్థానిక వీఆర్వో ఫిర్యాదు మేరకు అమలాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు బ్లూ కలర్ ‘NYC 86’ ముద్ర ఉన్న నెక్ టీ-షర్ట్, సిమెంట్ రంగు నిక్కరు ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి ఆచూకీ తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
గుర్తు తెలియని మృతదేహం లభ్యం


