హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సిద్ధవటంలో పోషణ మాసోత్సవంపై అవగాహన

KDP: సిద్ధవటంలోని 6,8 వార్డుల అంగన్‌వాడీ కేంద్రాల్లో బుధవారం పోషణ మాసం–2026పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంఛార్జ్ ఐసీడీఎస్ సీడీపీవో ఎం.సుగుణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సూపర్‌వైజర్లు దీప, శ్రీవిద్య పోషకాహారం, ఆరోగ్యం, ఆహార వైవిధ్యంపై అవగాహన కల్పించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషకాహారం తీసుకోవాలని సూచించారు.