MDK: రామాయంపేట మండలం వెంకటాపూర్(ఆర్) గ్రామంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 8వ వార్డు పిట్టల వాడలో రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి ప్రారంభించారు. గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అనురాధ నరేష్, సెక్రటరీ యాదగిరి, వార్డు సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి


