హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత జట్టు అరుదైన ఘనత

మహిళల టీ20 క్రికెట్‌లో భారత్‌ అరుదైన ఘనత సాధించింది. ఒక క్యాలెండర్‌ ఏడాదిలో 100కుపైగా సిక్సర్లు బాదిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. 2026లో ఇప్పటివరకు భారత మహిళల జట్టు 110 సిక్సర్లు కొట్టింది. దక్షిణాఫ్రికా 77 సిక్సర్లతో రెండో స్థానంలో ఉండగా, 2018లో భారత్‌ 67 సిక్సర్లు సాధించింది. తర్వాత స్థానాల్లో పాకిస్థాన్(63), బంగ్లాదేశ్(54) జట్లు ఉన్నాయి.